ఇంటి రుణ త్వరిత ఆమోదం
rimzim • February 7, 2023
మీ కోసం సరైన ఇంటిని కనుగొనడానికి చాలా సమయం పడుతుంది, ఎన్నో ఇళ్లులు లేదా అపార్ట్మెంట్లు చూసాక ఒక్కటి నచ్చుతుంది. ఇక ఇంటి రుణంతో ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, మీరు రుణాలు ఇచ్చే వారితో మళ్లీ సమావేశాలకు వెళ్లాలి, ఇందులో చాలా డాక్యుమెంటేషన్ మరియు పేపర్ వర్క్ ఉంటుంది. Home First ఫైనాన్స్ కంపెనీ రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ఇంటి రుణం విభాగంలో డిజిటల్ పద్ధతిలో పరిష్కారాలను ప్రవేశపెట్టింది.
మీరు ఆన్లైన్లో మీ దరఖాస్తును సబ్మిట్ చేసినప్పుడు, మీరు వెంటనే ఆమోదం పొందుతారు. Home Firstలో కేవలం 5 సులభమైన దశల్లో మీ రుణం మంజూరు అవుతుంది. ఈ సేవ మీకు ప్రాథమిక మంజూరు లెటర్‌ను ఇస్తుంది, దానిపై మీరు రుణాన్ని పొందవచ్చు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, Home First యొక్క SelfOnBoarding వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు అక్కడ ఉన్న 5 దశలను పాటించండి:
1 దశ : మీ ఖాతాను ధృవీకరించండి | 2 దశ: మీ ఆదాయ వివరాలను పేర్కొనండి | 3 దశ: మీ ఆస్తి వివరాలను వివరించండి | 4 దశ: మీ కాంటాక్ట్ వివరాలను అందించండి
5 దశ: రుణ ఆఫర్ పొందండి
Home First ఇంటి రుణం ఫీచర్లు
ఇది చాలా త్వరగా ఆమోదించబడుతుంది.
రుణ ఆమోదం సమయంలో, ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.
పెద్ద కంపెనీలు ప్రత్యేక ప్రాసెసింగ్ డీల్‌ను వారికి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ లావాదేవీలన్నీ ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా మరియు మొత్తం ఇంటి రుణ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లోనే పూర్తవుతుంది.
ఇంటి రుణం కోసం అర్హత
క్రెడిట్ స్కోర్/ క్రెడిట్ రిపోర్ట్: సాధారణంగా, రుణాలు ఇచ్చేవారు 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. అటువంటి అభ్యర్థులకు తక్కువ వడ్డీ రేట్లతో ఇంటి రుణాలు పొందే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు: సాధారణంగా, ఇంటి రుణం కోసం దరఖాస్తు చేయడానికి అతి తక్కువ వయస్సు 18 సంవత్సరాలు, మరియు రుణ మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. తిరిగి చెల్లించే సమయం సాధారణంగా 30 సంవత్సరాల వరకు ఉంటుంది, రుణాలిచ్చేవారు చాలా మంది పదవీ విరమణ వయస్సును గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు.
ఆదాయం మరియు ఉపాధి: మీ ఆదాయం మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది, ఎక్కువ సంపాదిస్తుంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్నట్టు పరిగణిస్తారు, ఇది రుణాలిచ్చేవారికి తక్కువ ప్రమాదాన్ని సూచిస్తుంది. వారి అధిక ఆదాయం అంచనా కారణంగా, నెలవారిగా జీతం పొందే ఉద్యోగులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను పొందేందుకు మంచి అవకాశం ఉంది.
తిరిగి చెల్లింపు సామర్థ్యం: ప్రతిపాదిత ఇంటి రుణంతో సహా మొత్తం EMI నిబద్ధత వారి మొత్తం ఆదాయంలో 50% మించని దరఖాస్తుదారులకు బ్యాంకులు మరియు HFCలు తరచుగా ఇంటి రుణాలను ఆమోదిస్తాయి. ఎక్కువ రుణ వ్యవధిని ఎంచుకోవడం ఇంటి రుణ EMIని తగ్గిస్తుంది కాబట్టి, తక్కువ రుణ అర్హత ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా వారి పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
ఆస్తి: ఇంటి రుణ అర్హతను నిర్ణయించేటప్పుడు, రుణాలను ఇచ్చేవారు ఆస్తి కోసం అందించే రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి ఆస్తి యొక్క భౌతిక పరిస్థితి, భవన లక్షణాలు మరియు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. RBI మార్గదర్శకాల ప్రకారం ఇంటి రుణంపై రుణదాత అందించే గరిష్ట మొత్తం ఆస్తి విలువలో 90 శాతం మించకూడదు.
అవసరమైన డాక్యుమెంట్లు
ఇంటి రుణాన్ని పొందేందుకు, దరఖాస్తు చేసుకునే వారి KYCని చూపించే అనేక పత్రాలను అందించాలి, వారు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి పూర్వాపరాలు, వారి ఆదాయ నేపథ్యం మరియు తదితరాలను బట్టి, వారు ఏ కస్టమర్ గ్రూప్‌కు చెందినవారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.(జీతం/వృత్తి/వ్యాపారవేత్త /NRI).
అవసరమైన డాక్యుమెంటేషన్ ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ఇంటి రుణం కోసం సాధారణంగా అడిగే డాక్యుమెంట్లు దిగువ ఉన్నాయి.
2022లో ఇంటి రుణం కోసం తప్పనిసరిగా ఉండాల్సిన 15 డాక్యుమెంట్లు
రుణ అభ్యర్ధన ఫారం
3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
గుర్తింపు పత్రాలు, నివాస సాక్ష్యం మరియు మునుపటి ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు/పాస్‌బుక్‌లు అవసరం.
దరఖాస్తుదారుని సంతకాన్ని బ్యాంకర్లు ధ్రువీకరిస్తారు.
వ్యక్తిగత ఆస్తులు మరియు అప్పుల స్టేట్మెంట్
ఆస్తి నిర్దిష్ట డాక్యుమెంటేషన్
యజమాని జీతం సర్టిఫికేట్ (ఒరిజినల్). (జీతం తీసుకునే ఉద్యోగులు)
గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫారం 16/ఐటి రిటర్న్స్ (జీతం తీసుకునే ఉద్యోగులు)
గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఐటి రిటర్న్‌లు /అసెస్మెంట్ ఆర్డర్ల యొక్క కాపీలు. (తమ కొరకు తాము పనిచేసే ప్రొఫెషనల్స్)
ముందస్తు ఆదాయపు పన్ను చెల్లింపు రుజువుగా చలాన్లు. (తమ కొరకు తాము పనిచేసే ప్రొఫెషనల్స్)
జీతం పొందని వ్యక్తులు కంపెనీ చిరునామా రుజువును అందించాలి. (తమ కొరకు తాము పనిచేసే ప్రొఫెషనల్స్)
గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్‌లు/అసెస్మెంట్ ఆర్డర్ల కాపీలు (స్వయం ఉపాధి కలిగిన వ్యవస్థాపకులు)
ముందస్తు ఆదాయపు పన్ను చెల్లింపు రుజువుగా చలాన్లు. (స్వయం ఉపాధి కలిగిన వ్యవస్థాపకులు)
ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు మీ కలల ఇంటిని వెతకడానికి ముందు, మీ ఆదాయం ఆధారంగా మీకు ఇంటి రుణం రూపంలో ఎంత లభిస్తుంది అనే ఆలోచన మీకు ఉండాలి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటికి సంబంధించి ఆర్థికగా నిర్ణయాలను తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మీరు ఎంత డబ్బుకు అర్హత పొందారో తెలుసుకోవడానికి, రుణ అర్హత కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. ఏ ఆస్తినో నిర్ణయించుకొన్న తర్వాత, మీరు Home First వెబ్‌సైట్‌కి వెళ్లి, ఎంక్వయిరీ ఫారమ్‌ను పూర్తిచేసిన తరువాత మా కౌన్సెలర్లలో ఒకరు మీకు కాల్ చేస్తారు. రుణ నిబంధనల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ కథనాన్ని చదవవచ్చు లేదా రుణ దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకోవడానికి ఈ పోస్ట్‌ను చదవవచ్చు.
పై సమాచారంతో, ప్రతి ఒక్కరికి వారి సంపాదన ఆధారంగా ఎంత రుణం లభిస్తుంది అనే స్పష్టత వస్తుంది, దానికి అనుగుణంగా మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేసే దిశగా అడుగులు వేయవచ్చు.