తనఖా ఋణం అంటే ఏమిటి? తనఖా ఋణ మూలాంశాలను తెలుసుకోండి.
•
జీవితంలో, మనం కొన్ని ఖర్చులను నివారించలేని కొన్ని నిర్దిష్ట పరిస్థితులను అనుభవిస్తాము. ఈ ఖర్చులు చాలావరకు, వ్యాపార విస్తరణ, వివాహం, వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్య లాంటివి. ఈ అవసరాలను తీర్చడానికి అటువంటి పరిష్కారం తనఖా ఋణం పొందడం. తనఖా ఋణాలు స్వభావరీత్యా సురక్షితమైనవి. ఋణగ్రహీత ఆస్తికి ప్రతిగా, ఈ విధమైన ఋణం పొందటానికి ఋణదాత వద్ద తమ ఆస్తిని తనఖా పెట్టాలి. ఈ ఋణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ ఆస్తి అనుషంగికంగా, ఋణదాత చేత నిర్వహించబడుతుంది. సమానమైన నెలవారీ వాయిదాలు లేదా ఇఎంఐల ద్వారా ఈ ఋణం తిరిగి చెల్లించబడుతుంది.
తనఖా ఋణం అంటే ఏమిటి?
తనఖా ఋణం అనేది మీరు కలిగి ఉన్న ఆస్తికి ప్రతిగా చేసిన ఋణం. అలాంటి ఆస్తి ఏమిటంటే, మీ ఇల్లు, దుకాణం లేదా వ్యవసాయేతర భూమి కావచ్చు. తనఖా ఋణాలను బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ఋణదాత, మీకు ఋణం అసలు మొత్తాన్ని అందిస్తారు మరియు దానిపై మీకు వడ్డీని వసూలు చేస్తారు. మీరు సులభమైన నెలవారీ వాయిదాలలో ఋణాన్ని తిరిగి చెల్లిస్తారు. మీ ఆస్తే మీ హామీ మరియు ఋణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు అది ఋణదాత వద్ద ఉంటుంది. అందుకని, ఋణదాత ఋణం యొక్క కాల వ్యవధి వరకు ఆస్తిపై చట్టపరమైన క్లెయిమ్ ను కలిగి ఉంటారు మరియు ఋణగ్రహీత, ఋణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, ఋణదాతకు దానిని స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి హక్కు ఉంటుంది.
తనఖా ఋణ రకాలు ఏవి?
వివిధ రకాల తనఖాలు ఈక్రింది విధంగా ఉన్నాయి:
- సాధారణ తనఖా:అటువంటి తనఖాలో, ఋణగ్రహీత అతను/ఆమె అరువు తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించలేకపోతే, ఋణదాత తను ఇచ్చిన ఋణన్ని తిరిగి వాపసు పొందటానికి ఎవరికైనా ఆస్తిని అమ్మవచ్చు అని పేర్కొంటూ ఒక ఒప్పందంపై సంతకం చేయాలి.
- షరతులతో కూడిన అమ్మకం ద్వారా తనఖా:అటువంటి తనఖా కింద, ఋణదాత తిరిగి చెల్లించే విషయంలో ఋణగ్రహీత తప్పనిసరిగా అనుసరించాల్సిన నిర్దిష్ట షరతులను ఉంచవచ్చు. ఈ షరతులలో నెలవారీ వాయిదాలలో ఆలస్యం, తిరిగి చెల్లించడంలో ఆలస్యం కారణంగా వడ్డీ రేటులో పెరుగుదల మొదలైనవి ఉంటే ఆస్తి అమ్మకం ఉండవచ్చు.
- ఇంగ్లీష్ తనఖా:ఈ విధమైన తనఖా సమయంలో, ఋణ మొత్తాన్ని తిరిగి చెల్లించినంతనే ఆస్తి, తిరిగి ఋణగ్రహీతకు బదిలీ చేయబడుతుందనే షరతుతో, ఋణగ్రహీత డబ్బు తీసుకునే సమయంలో తన పేరుపై గల ఆస్తిని ఋణదాతకు బదిలీ చేయవలసి ఉంటుంది.
- స్థిర-రేటు తనఖా:ఋణ వ్యవధిలో వడ్డీ రేటు సమానంగా ఉంటుందని ఋణదాత, ఋణగ్రహీతకు హామీ ఇచ్చినప్పుడు దీనిని స్థిర-రేటు తనఖా అని అంటారు
- అనుభోగి తనఖా:ఈ రకమైన తనఖా ఋణదాతకు ప్రయోజనం ఇస్తుంది. ఋణ కాల వ్యవధిలో ఋణదాతకు ఆస్తిపై సరైన హక్కు ఉంటుంది, అతను ఆస్తిని అద్దెకు ఇవ్వవచ్చు లేదా తిరిగి చెల్లించే వరకు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ చాలావరకు హక్కులు యజమానికే ఉంటాయి
- క్రమరహిత తనఖా:వివిధ రకాల తనఖాల సమ్మేళనాన్ని, అనామలస్ (క్రమరహిత) తనఖా అని అంటారు
- రివర్స్ తనఖా: ఈ సందర్భంలో, ఋణదాత ఋణగ్రహీతకు నెలవారీ ప్రాతిపదికన ఋణాలు ఇస్తాడు. మొత్తం ఋణ మొత్తం, వాయిదాలుగా విభజించబడుతుంది మరియు అందువల్ల ఋణదాత ఋణగ్రహీతకు డబ్బును, ఆ వాయిదాలలో ఇస్తాడు
- ఈక్విటబుల్ తనఖా:ఈ విధమైన తనఖా సమయంలో, ఆస్తి యొక్క టైటిల్ ఒప్పందాలు ఋణదాతకు ఇవ్వబడతాయి. ఇది తరచుగా బ్యాంకింగ్ తనఖా ఋణాలలో ఒక ప్రామాణిక పద్ధతి. ఇది ఆస్తిని భద్రపరచడం కొరకు చేయబడుతుంది.
తనఖా ఒప్పందం అంటే ఏమిటి?
తనఖా ఋణ ఒప్పందం బ్యాంకు మరియు ఋణగ్రహీత మధ్య ఒప్పందం యొక్క షరతులను నిర్దేశిస్తుంది. గుర్తించబడినప్పుడు, ఒప్పందం ఋణగ్రహీతకు డబ్బు పొందడానికి వీలవుతుంది. అటువంటి ఒప్పందం ఋణగ్రహీత ఋణ వాయిదాలను చెల్లించకపోతే ఋణదాత అలా అమ్మిన ఆస్తిని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారు.
తనఖా యొక్క ప్రాముఖ్యత:
ఇల్లు కొనడం బహుశా మీరు చేసే గొప్ప కొనుగోలు కావచ్చు మరియు గృహ ఋణం అనేది మీకు ఒక అతిపెద్ద బాధ్యత అవుతుంది. మీరు మీ గృహ ఋణాన్ని చాలా సంవత్సరాలుగా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉన్నందున, మీరు ప్రతి నెలా తిరిగి చెల్లించే మొత్తం మరింత సహేతుకమైనది మరియు సరసమైనదిగా ఉండాలి!
ఎవరైనా వారి మొదటి తనఖా ఋణాన్ని తీసుకున్నప్పుడు, వారు సాధారణంగా దీర్ఘకాలిక కాలవ్యవధిని ఎన్నుకుంటారు. అయితే, దీని గురించి ఎటువంటి మార్గదర్శకాలు లేవు మరియు మనం ఎక్కువ కాలం జీవిస్తున్నందున మరియు పదవీ విరమణ వయస్సు పెరుగుతున్నందున, 30 సంవత్సరాల తనఖా మరింత సాధారణం అవుతోంది. ఇది మీ నెలవారీ చెల్లింపులను తగ్గించడానికి సహాయపడుతుంది, అయినప్పటికీ మరొక వైపు మీపై మరింత బాధ్యతా భారం పడుతుంది.
మీకు వీలయ్యే అతి తక్కువ కాలవ్యవధిని ఎంచుకోవడం ఉత్తమం – మీరు త్వరగా తనఖా నుండి విముక్తులు కావడమే కాకుండా, మీకు వడ్డీ కూడా పెద్ద మొత్తంలో మిగులుతుంది. అలాగే, గుర్తుంచుకోండి, మీరు తిరిగి తకఖా పెట్టి, మరొక ఉత్పత్తికి మారినప్పుడు, మీరు మరో 25 లేదా దీర్ఘకాలికంగా తనఖా ఉంచకూడదు.
ఈ కథనాన్ని వాట్స్ యాప్ లో షేర్ చేయండి.