COVID 19 మొరాటోరియం ప్రోగ్రామ్
rimzim • July 15, 2020
COVID 19 నివారణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణం చేత వినియోగదారులకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు కలిగినవి. మార్చి 27th, 2020 నాడు ఆర్బీఐ తను ప్రకటించిన నోటిఫికేషన్లో మార్చి 1,2020 నుండి మే 31,2020 వరకు ఉన్నటువంటి అన్ని వాయిదాల పై covid 19- 3 నెలల మారటోరియం ఇవ్వడానికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగినది. అందుకు కారణం చేత మా వినియోగదారులకు COVID-19 Moratorium Program ఇస్తున్నాము.
ఇందు కొరకు విధివిధానాలు ఈ క్రింద తెలియ చేయబడ్డాయి:
మార్చి 1 2020 నాటికి లోన్ తీసుకున్నవారందరికీ ( జీతభత్యాలు కలవారు, స్వయం ఉపాధి ఉన్నవారు, ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యులు ). ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఈ మారటోరియం 1 మార్చి 2020 నుండి 31 st మే 2020 వరకు ఉన్నటువంటి వాయిదాల పేమెంట్స్ పై మాత్రమే అనుసరించబడతాయి. 1 మార్చి ,2020 నాటికి చెల్లించకుండా ఉన్న బకాయిలకు COVID-19 Moratorium వర్తించదు.
ఇందు కొరకు వినియోగదారులు covid-19 Moratorium కి గాను తమ చెల్లింపు ప్రణాళికలను మరియు అంగీకార ప్రతి మాకు అందజేయవలసి ఉంటుంది. అంగీకార ప్రతి వివరాలకు క్లిక్ చెయ్యండి.
మారటోరియం ఎంచుకున్న వినియోగదారులు వారి EMI కొనసాగించాలి అనుకుంటే COVID-19 Moratorium నిఒక రిక్వెస్ట్ ద్వారా క్యాన్సల్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ప్రతి కై ఇక్కడ క్లిక్ చెయ్యండి.
వినియోగదారులు మార్చ్ ,ఏప్రిల్ కి గాను ఈఎంఐ చెల్లించి ఉన్నా, మే నెల కు గానూ మారటోరియం తీసుకోవచ్చు..
COVID-19 Moratorium పనిచేయు విధానం మరియు కస్టమర్ పై ప్రభావం
Loan Amount: Rs. 10 Lakhs
ROI: 13.50%
EMI: Rs. 12,074
Original loan tenure: 240 months
Balance loan tenure: 200 months (starting from April 2020 and ending in Nov 2036)
కస్టమర్ మార్చ్ నెల వాయిదా కట్టిఉన్నారు
పైన తెలుపబడిన కస్టమర్ 4th ఏప్రిల్,2020 మరియు 4th మే,2020 నెల ఈఎంఐలు (Rs.12,074) కట్టిన యెడల, ఈ ఈఎంఐలలో వడ్డీ Rs.10,784 మరియు Rs. 10,770, అసలు Rs.1291 మరియు Rs.1305. అయితే మేము COVID 19 Moratorium ప్రతిపాదించాము.
ఈ ప్రోగ్రాం అనుసరించి వినియోగదారులు ఏప్రిల్ ,మే నెలలకు గాను ఏ విధమైన ఈఎంఐ/ వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. 4 జూన్ 2020 నుండి వినియోగదారుల యొక్క ఈఎంఐ చెల్లింపులు కొనసాగింపడతాయి.వాటిల్లో అసలు మరియు వడ్డీ కూడా ఉంటాయి
ఏప్రిల్ ,మే నెలలకు గాను మేము ప్రిన్సిపల్ ఎమౌంట్ తీసుకోని కారణంగా వినియోగదారుల యొక్క లోన్ ముగింపు గడువు 2 నెలలు పొడిగింపబడుతుంది కస్టమర్ల యొక్క బాకీ ఉన్నటువంటి 200 నెలల గడువు జూన్ 2020 న మొదలయ్యి జనవరి 2032 తో ముగుస్తుంది
మా హోమ్ ఫస్ట్ సంస్థ నందు వినియోగదారుల చెల్లింపులకు రెండు విధములు ప్రతిపాదించబడ్డాయి
మీరు చెల్లించవలసిన బకాయిలు (Rs.21,554) ఆరు నెలల్లో సమముగా విభజించబడ్డ మొత్తమును మీ లోన్ లో ఉన్న వడ్డీ రేటు తో సమానముగా చెల్లించుట(జూన్ నెల లో కట్టవలసిన ఈఎంఐ Rs.12,074 కు అదనంగా Rs. 3,798). అదనపు మొత్తం తో కలిపి ఈఎంఐ చెల్లించుట 4th జూన్,2020 నుండి మొదలవుతుంది
మీరు చెల్లించవలసిన బకాయిలను 12 నెలల్లో సమముగా విభజించబడ్డ మొత్తమును మీ లోన్ లో ఉన్న వడ్డీ రేటు తో సమానముగా చెల్లించుట. (జూన్ నెల లో కట్టవలసిన ఈఎంఐ Rs.12,074 కు అదనంగా Rs. 1,963). అదనపు మొత్తం తో కలిపి ఈఎంఐ చెల్లించుట 4th జూన్,2020 నుండి మొదలవుతుంది
కస్టమర్ మార్చ్ మాసము కు కూడా మారటోరియం కావలినచో మార్చ్ నెల కట్టవలసిన ఈఎంఐ కూడా 6 లేదా 12 మాసములో సమానంగా చెల్లించవలెను