ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సిఎల్ఎస్ఎస్ పథకం
rimzim • September 9, 2020
మనయొక్క గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు 2022 నాటికి “అందరికీ సొంత ఇల్లు” అందించే ఉద్దేశ్యంతో 25 జూన్ 2015 న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. PMAY యోజన యొక్క ప్రముఖ విభాగం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS). ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ .6 లక్షల వరకు సంపాదించే ఇడబ్ల్యుఎస్ / ఎల్ఐజి వర్గానికి చెందిన మొదటిసారి గృహ కొనుగోలుదారులు అయినవారికిప్రయోజనం చేకూరుతుంది.
మధ్య-ఆదాయ సమూహం కోసం కొత్త CLSS పథకం 01.01.2017 నుండి CLSS-MIG,గా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.ఇప్పుడు వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు వరకు కలిగిన వినియోగదారులు కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన రాయితీని పొందవచ్చు..ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 2 ఉపవర్గాలు ఉన్నాయి, MIG1 (వార్షిక ఆదాయం రూ .6,00,001 నుండి 12,00,000) మరియు MIG2 (వార్షిక ఆదాయం రూ .12,00,001 నుండి 18,00,000 వరకు).
సబ్సిడీ కింద ప్రయోజనాలు ఏమిటి ?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – సిఎల్‌ఎస్‌ఎస్ (ఇడబ్ల్యుఎస్ / ఎల్‌ఐజి) పథకం కింద లబ్ధిదారులు తమ గృహ రుణంపై రూ .2,67,000 వరకు సబ్సిడీకి అర్హులు. సిఎల్‌ఎస్‌ఎస్ – ఎంఐజి కింద, ఎంఐజి 1 కి గరిష్ట సబ్సిడీ – రూ. 2,35,068 & ఎంఐజి 2 కి మాక్స్ సబ్సిడీ – రూ. 2,30,156.
ఉదాహరణకు, మీరు రూ .10,00,000 గృహ రుణం తీసుకుంటే, సబ్సిడీ మొత్తం రూ. 2,67,000 వచ్చినట్లయితే. మీ రుణ మొత్తం నుండి 2,67,000 తగ్గించబడుతుంది(10,00,000 – 2,67,000) అనగా తిరిగి చెల్లించవలసిన బకాయి రూ. 7,33,000.
సబ్సిడీని ఎవరు పొందవచ్చు?
సరళంగా చెప్పాలంటే, మొదటిసారి ఇంటి కొనుగోలుదారులు ఈ రాయితీని పొందవచ్చు. మీ సౌలభ్యం కోసం, క్రింద ఇచ్చిన పట్టికను చూడండి.
EWS/ LIG వర్గానికి చందిన ఇతర షరతులు:
- కుటుంబం (అనగా నేను, జీవిత భాగస్వామి మరియు పెళ్లికాని పిల్లలు) ఏ పక్కా ఇంటిని కలిగి ఉండకూడదు
- ముందుగానే స్థలం ఉంది ఇల్లు నిర్మాణ లోన్ కావలిసి ఉన్నప్పుడు ఆస్థి కుటుంభం లో ఎవరి పేరు మీద ఉన్న చెల్లుబాటు అవుతుంది
- 3.అలాగే, మీరు సబ్సిడీతో రుణం ఉపయోగించి కొనుగోలు / నిర్మించే ఇల్లు కుటుంబలో మహిళా పెద్ద పేరు మీద ఉండాలి లేదా ఆమె కుటుంబంలోని మగపెద్దతో కలిపి ఉమ్మడిగా నమోదు చేసుకోవచ్చు.
- కుటుంభం లో మహిళా పెద్ద లేని యెడల మగవారు పేరు మీద ఆస్థి ఉండవచ్చు
MIG-1/ MIG-2 వర్గానికి చందిన ఇతర షరతులు
- కుటుంబం (అనగా నేను, జీవిత భాగస్వామి మరియు పెళ్లికాని పిల్లలు) ఏ పక్కా ఇంటిని కలిగి ఉండకూడదు
- 2.తల్లిదండ్రులు ఇంటిని కలిగి ఉన్నప్పటికీ పెళ్లికాని సంపాదించే కొడుకు / కుమార్తె సబ్సిడీని పొందవచ్చు
ఈ రాయితీ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి?
అదనపు పత్రాలు ఏవి అవసరం లేదు. మీరు పక్కా ఇంటిని కలిగి ఉండరని డిక్లరేషన్ సమర్పించాలి. మీకు ఆదాయ రుజువు లేకపోతే (జీతం స్లిప్స్,, ఫారం 16 లేదా ఐటిఆర్) మీ వార్షిక కుటుంబ ఆదాయాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
సబ్సి డీ కోసం నేను ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు ?
హోమ్‌ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో మాతో మీ గృహ రుణంపై సబ్సి డీ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వేరే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో కొనసాగుతున్న గృహ రుణం ఉంటే, మీరు మీ గృహ రుణాన్ని మాతో బదిలీ చేయవచ్చు మరియు సబ్సిడీని పొందవచ్చు.
హోమ్‌ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో మేము, కస్టమర్లు అందరికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సిఎల్‌ఎస్‌ఎస్ సబ్సిడీ ప్రయోజనం పొందేలా ఎల్లప్పుడూ చురుకుగా ఉన్నాము. ఈ రోజు వరకు, మేము రూ. 14,100 మందికి పైగా వినియోగదారులకు 334 కోట్లు రూపాయలు సబ్సిడీ ద్వారా ఇచ్చాము
మా నినాదం ఎల్లప్పుడూ “అవ్యవస్థీకృత వర్గానికి చెందిన వారికి వేగంగా మరియు చాలా సులభమైన డాక్యుమెంటేషన్‌తో
గృహ రుణ సౌకర్యం అందించటం”మరియు వారికి ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాము!