ప్రధాన మంత్రర ఆవాస్ యోజన
•
Read this in Hindi, English & Gujarati.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) మొదటి సారిగా ఇల్లు కొనుగోలు చేస్తున్న వారికి అనేక ప్రయోజానాలను అందించింది. PMAY అందిస్తున్న ప్రయోజానాలలో మొదటిది హోమ్ లోన్ వడ్డీపై సబ్సిడీ. మీ ఆదాయ పరిమితి ప్రకారం మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకుని, మీరు కొనుగోలు చేసిన ఇల్లు కార్పెట్ ఏరియా పథకం ప్రమాణాల ప్రకారం ఉంటే, మీ హోమ్ లోన్‌కు PMAY సబ్సిడీ పొందడం చాలా సులభం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (PMAY-U) 2.0ను కేంద్ర ప్రభుత్వం, ఆర్థికంగా వెనుకబడిన 1 కోటి మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక మద్దతు అందించడానికి ఆమోదించబడింది. రాబోయే 5 సంవత్సరాలలో, నగర ప్రాంతాలలో అందుబాటు ధరలలో ఇళ్ళను నిర్మించడం, కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడంలో మద్దతు ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భారతదేశ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ప్రధాన కారణం మధ్య తరగతి కుటుంబాలలో అందుబాటు ధరలలో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పక్కా ఇళ్ళను అందించడమే. PMAY-U స్కీమ్ ఇప్పటికే 1.18 కోట్ల ఇళ్లను స్వంతం చేసుకోవడంలో పౌరులకు సహాయం చేసింది, అలాగే 85.5 లక్షల ఇళ్ళను నగర ప్రాంతాలలో అందించింది.
PMAY: ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనకరం?
PMAY ప్రధాన లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన వర్గం అలాగే ఇప్పటికీ స్వంత గృహంలేని మధ్య తరగతి కుటుంబాలు. అయితే, వితంతువులు, మైనారిటీలు, SC/STలు, నిర్మాణ పనుల కార్మికులు, మురికివాడలలో నివసిస్తున్నవారు, అంగన్వాడీ వర్కర్ల వంటి వారికి మొదటి ప్రాధాన్యత.
PMAY 2.0 అర్హత ప్రమాణాలు
PMAY- U 2.0కు అర్హత పొందడానికి కావలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి-
- దేశంలో ఎక్కడ ఇప్పటి వరకు స్వంత పక్కా ఇల్లు ఉండకూడదు
- EWS (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కుటుంబాలకు, సంవత్సర ఆదాయం ₹3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
- LIG (తక్కువ ఆదాయ సమూహం) కుటుంబాలకు సంవత్సర ఆదాయం ₹3 లక్షల నుండి ₹6 లక్షల మధ్య ఉండాలి.
- MIG (అధిక ఆదాయ సమూహం) కుటుంబాలకు సంవత్సర ఆదాయం ₹6 లక్షల నుండి ₹9 లక్షల మధ్య ఉండాలి.
- మీరు ఇంతకు ముందు వేరే ఇతర ప్రభుత్వ హౌసింగ్ పథకం క్రింద ఎటువంటి ఆర్థిక సహాయం పొంది ఉండకూడదు.
- అప్పటికే నిర్మించిన ఇళ్ళకు ఈ స్కీమ్ వర్తించదు.
PMAY-U 2.0 అంశాలు
పౌరులకు ప్రయోజనాలు అందించడానికి PMAY 2.0 పరిధిలోని అంశాలు-
- లబ్దిదారులచే నిర్మాణం కన్స్ట్రక్షన్ (BLC-బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్)- ఇందులో, EWS పరిధిలోని అర్హత కలిగిన కుటుంబాలకు వారి స్వంత స్థలంలోనే కొత్త ఇళ్ళు కట్టుకుంటే ప్రయోజానాలు అందుతాయి.
- భాగస్వామ్యంతో అందుబాటు ధరలలో హౌసింగ్ (AHP – ఎఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్)– AHP క్రింద, ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్‌ల నుండి ఇల్లు కొనుగోలు చేసినప్పుడు లబ్దిదారులకు రిడీమ్ చేసుకోగల హౌసింగ్ వోచర్లు అందుతాయి. వినూత్న టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణం చేస్తే, ప్రతీ చమీ/యూనిట్‌కు అదనంగా ₹1000 ఇవ్వబడుతుంది.
- అందుబాటు ధరలో అద్దె ఇల్లు (ARH – ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్) – ఈ ప్రత్యేకమైన స్కీమ్ ప్రకారం, నగరాలకు వలస వచ్చిన వారికి, విద్యర్థులకు, కార్మికులకు, వర్కింగ్ వుమెన్‌కు ఇల్లు అద్దెకు తీసుకోవడంలో సహాయం చేస్తుంది. ARH, శాశ్వతంగా ఇల్లు కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేకుండా, తాత్కాలిక వసతి కోసం చూస్తున్న వారికి పరిశుభ్రమైన వసతి అందించేలా చూసుకునే స్కీమ్.
- వడ్డీ సబ్సిడీ స్కీమ్ (ISS – ఇంటరెస్ట్ సబ్సిడి స్కీమ్)– ఈ స్కీమ్ ప్రకారం, EWS, LIG మరియు MIG కుటుంబాలకు హోమ్ లోన్లకు సబ్సిడీలు ఇవ్వబడతాయి. ఈ పథకం కింద ఆస్తి గరిష్ట విలువ ₹35 లక్షల కంటే తక్కువగా ఉండాలి మరియు లోన్ విలువ ₹25 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ 4% వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది. ఐదు సంవత్సరాల వాయిదాలలో ₹8 లక్షల వరకు గృహ రుణ సబ్సిడీ అందించబడుతుంది.