భారతదేశంలో భవనం నిర్మించే దశల వారీ ప్రక్రియ ఏమిటి?
•
ఏకారణంవల్లనో, మీరు ముందే నిర్మించిన ఇంటితో రాజీ పడకుండా మీ సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఎవరో చెప్పినట్లు, మీరు ఆట గెలవలేకపోతే, దాన్ని మార్చండి! బహుశా అది నేనే చెప్పానేమో. ఏదేమైనా, ఇప్పుడు మీరు మీ సొంత ఇంటిని నిర్మించాలని చూస్తున్నందున, దీనికి చాలా ఓపిక మరియు మూలధనం అవసరం. కాబట్టి, మీరు మెడిటేషన్ ను ప్రాక్టీస్ చేయడం మరియు ఆదా చేయడం ప్రారంభించండి లేదా మీరు హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ ను పొందవచ్చు. ఇప్పుడు ప్రారంభిద్దాం.
పార్ట్ 1 – ప్లానింగ్:
దూకుడు స్వభావము గల వారికి సొంత ఇంటిని నిర్మించడం అనేది మంచిది కాదు. మీకు సంతృప్తి కరమైన ఇల్లు కావలసినట్లైతే మీ అవసరాల గురించి స్పష్టత కలిగి ఉండటం అవసరం. ఆ స్పష్టత ప్లానింగ్ ద్వారానే వస్తుంది. అయితే, మీరు దేని గురించి ప్లాన్ చేయాలి?
-
అనుమతులు
ఇందులో స్థానిక పాలక సంస్థల నుండి NOC లు లేదా అనుమతులు, వ్యవసాయేతర భూమి అయితే ధృవీకరించడానికి NA సర్టిఫికేట్ మరియు మీ బిల్డింగ్ ప్లాన్ పై అనుమతి ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా మీరు స్థానిక నీటి సరఫరా మరియు విద్యుత్ సరఫరా బోర్డుల నుండి కూడా అనుమతి పొందాలి. అవును, చాలా మంది సంతోషంగా ఉండాలని కోరుకుంటారు! మీ సౌలభ్యం కోసం, మీరు సిద్ధం గా ఉంచుకోవాల్సిన క్రింద జత చేయబడ్డాయి –
-
బిల్డింగ్ ప్లాన్ కాపీ
దీనిని స్థానిక మునిసిపల్ బాడీకి సమర్పించాలి. వేర్వేరు ప్రభుత్వ సంస్థలు వేర్వేరు సంఖ్యలో కాపీలను అడగవచ్చు కాబట్టి కాపీలను ఎక్కువ సంఖ్యలో సిద్ధంగా ఉంచండి.
-
హక్కుదారు యొక్క రుజువు
ఇది మీరు భూమిని కలిగి ఉన్నారని నిరూపించడానికి. లీజు దస్తావేజు లేదా భూమి యొక్క అమ్మకపు దస్తావేజు ఇక్కడ పనికి వస్తుంది. మీకు లీజు దస్తావేజు లేకపోతే, సమర్థాధికారి నుండి ఒక NOC అవసరం
-
ప్రతిపాదించిన నిర్మాణం యొక్క వివరాలు
ప్రతిపాదించిన నిర్మాణం యొక్క సాంకేతిక వివరాలు ఉండాలి.
-
పర్యవేక్షణ సర్టిఫికేట్
ఇది రిజిస్టర్డ్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్, సూపర్వైజర్ మరియు ప్లంబర్ చేత సంతకం చేయబడిన ఒక సర్టిఫికేట్. నిర్దేశించిన ఫార్మాట్‌ను స్థానిక మునిసిపల్ బాడీ నుండి పొందవచ్చు. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మీ సర్టిఫికెట్‌పై సంతకం చేసిన నిపుణులందరి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కూడా దీనికి మద్దతునివ్వాలి. మీరు నిపుణుడి నుండి నిర్మాణ స్థిరత్వ ధృవీకరణ పత్రాన్ని కూడా పొందాలి మరియు, వారి రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా అవసరం. కాబట్టి, మీ కోసం ప్రతిదానిపై సంతకం చేయమని మీ స్నేహితుడిని అడగడం మంచిది కాదు.
-
పూర్తి అయినట్లుగా ధృవీకరణ పత్రం
చాలా మంది బిల్డర్లు మాట్లాడే OC గురించి మీరు తప్పక విని ఉంటారు. ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరమయ్యే ఆన్-కంప్లీషన్ సర్టిఫికేట్.
-
నో డ్యూస్ సర్టిఫికేట్
ఇది పన్ను శాఖ నుండి వచ్చిన ఎన్ఓసి.
ఓహ్, ఇంత ఉందా అనిపిస్తుంది కదూ! ఇప్పుడు మరో ముఖ్యమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం.
-
బడ్జెట్
మీ మనస్సులో స్పష్టమైన బడ్జెట్ ఉంచుకోండి. కొత్త ఇంటి ధరలు వివిధ అంశాలపై ఆధారపడి చదరపు అడుగుకు రూ .2000 నుండి రూ. 20,000 రూపాయలు వరకు ఉండవచ్చు. అందువల్ల, మీ ఇల్లు ఎంత పెద్దదిగా ఉంటుందో నిర్ణయించడానికి బడ్జెట్ మీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు మేము మీకు ఇక్కడ సహాయం చేస్తాము. మీ బడ్జెట్లో మీరు పరిగణించవలసిన అంశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- భూమి ఖర్చు
- పన్నులు మరియు ఫీజులు
- డిజైనింగ్ మరియు ఇంజనీరింగ్ ఖర్చులు
- నిర్మాణ వ్యయం
- ల్యాండ్ స్కేపింగ్ ఖర్చు
- ఇంటీరియర్ డెకరేషన్
- అత్యవసర నిధులు
మీరు లోన్ కూడా పొందవలసి ఉంటుంది, కాబట్టి ఆ లోన్ పై వడ్డీ ఖర్చును కూడా పరిగణించాలి.
-
టైమ్ -ఫ్రేమ్
మీ ఇల్లు నిర్మించబడటానికి మీరు శాశ్వతముగా వేచి ఉండలేరు. చాలా వరకు, మీరు వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటారు. కానీ ఇది రోమ్ లాంటిది – ఒక రోజులో నిర్మించబడటానికి. కానీ మీకు ఇంకా ఎంత సమయం పడుతుందనే దాని గురించి ఒక ప్లాన్ ఉండి ఉండవచ్చు. మీ కుటుంబంలో నూతన శిశువు జన్మించడం, మీ ప్రస్తుత ఇంటిపై లీజు ముగింపు లేదా మీ పిల్లల పాఠశాల చదువు పై ప్రభావం వంటి వివిధ అంశాలు మీ కొత్త ఇంటికి ఎంత ముందుగా లేదా ఆలస్యంగా వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. నేటి యుగంలో, వాతావరణం కూడా మీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, వర్షాలు రాకముందే మీరు మీ సొంత ఇంటికి మారాలనుకోవడం.
-
ప్రదేశం
మీరు నిర్మాణం చేసే ప్రదేశం మీ ఇంటి తో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అనే దానిని బాగా ప్రభావితం చేస్తుంది. ఇది మీ ఇల్లు ఎలా నిర్మించబడాలో కూడా నిర్ణయిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ కు సంబంధించినది, రియల్ ఎస్టేట్ ఒక సంక్లిష్టమైన వ్యాపారం అని మాకు తెలుసు. మంచి ప్రదేశం కోసం చూస్తున్నప్పుడు ఈ క్రింది వాటిని పరిగణన లోనికి తీసుకోవాలి:
- ప్లాట్ యొక్క పరిమాణం
- ఇతర ఇళ్లతో ఉన్నటువంటి సంబంధం
- భూమి వాలు
- ప్లాట్ యొక్క దిశ (తూర్పు, పడమర, మొదలైనవి)
- పరిసరాలు
- సమీపంలోని ఇతర గృహాల శైలి
- ఫార్మసీ, పాఠశాల మొదలైన వాటి వంటి వాటికి అందుబాటు.
- ప్రైవసీ మరియు సామాజిక పరిచయాల మధ్య సమతుల్యం
Quora దీనిపై మీకు సమాధానాలు ఇస్తుందని మీరు భావించిన ఒక వాస్తవం, ఈ అన్ని అంశాల కోసం ఒక ప్రొఫెషనల్‌ని సంప్రదించమనే సలహా మీకు ఇవ్వమని నన్ను ప్రోత్సహించింది.
ఒక ప్రొఫెషనల్ ఈ క్రింది సమాచారంతో మీకు సహాయం చేయవచ్చు:
-
జోనింగ్
ఇది ఇల్లు మరియు ప్రధాన వీధి మధ్య మీరు కలిగి ఉన్న దూరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంటి ఎత్తు కూడా ప్రభావితమవుతుంది. తన ఇంటి సరిహద్దు ఎత్తు కారణంగా SRK కొన్ని చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిన విషయం గుర్తుందా? అవును, నేను అతనిలా ఉండటానికి ఇష్టపడ కపోవడానికి ఇది ఒక కారణం.
-
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భాగము
మీరు నిర్మిస్తున్న భూమికి ఏదైనా చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంటే, మీ ఇల్లు ఎలా ఉండాలి మరియు ఏ మెటీరియల్స్ తో నిర్మించబడాలి వంటి వాటిపై కొన్ని పరిమితుల ద్వారా మీరు నియంత్రిచబడవచ్చు. ఇది వింతగా అనిపించవచ్చు కాని ప్రజలు వారి చరిత్రతో జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడరు. పద్మావత్ గురించి ఆలోచించండి.
-
పరిసరాల్లోని నిర్మాణానికి అయిన సగటు వ్యయం
ఈ విషయంలో ఒక ప్రొఫెషనల్ ఆ ప్రదేశము యొక్క నిర్మాణ వ్యయంతో మరింతఎక్కువ అప్డేట్ అయి ఉంటారు .
పార్ట్ 2 – డిజైనింగ్:
ఆ విధంగా, మీరు నిర్మాణం కోసం బాగా ప్లాన్ చేసారు. ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఎంచుకున్న భాగం ఇప్పుడు వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే, మీ ఇంటిని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేయడానికి మీకు అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న చెడ్డ విషయం ఏమిటంటే, మీరు మీ ఇంటిని మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవాలి మరియు ఈ విషయం లో మీకు అసంతృప్తి ఉండకూడదు. డోర్క్ నోబ్లు వంటివి ఎంచుకోవడం కూడా చాలా భయం కలిగిస్తుంది . అందువల్ల, మీరు తప్పక ఇంటీరియర్ డిజైనర్‌ను పొందండి. మీరు DIY మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే, ఈ క్రింది ప్రశ్నలు మీకు సహాయపడతాయి:
- ఇంటి పరిమాణం
- పరిమాణంపై ఏదైనా పరిమితులు ఉన్నాయా?
- ఎన్ని అంతస్తులు ఉండవచ్చు?
- మీకు ఎలాంటి గదులు అవసరం?
- మీ జీవనశైలి మీ ఇంటి సౌందర్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
- మీకు ఎలాంటి లేఅవుట్ అవసరం?
- మీరు ఏ డిజైన్‌ను ఇష్టపడతారు? ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ మార్బుల్స్ లేదా కోటా రాయి మీకు నచ్చిందా? మహోగని ఫర్నిచర్ కావాలా లేదా సాధారణ లుక్ చాలా?
- ఫైర్ ప్లేస్ వంటి ఏదైనా ప్రత్యేక లక్షణాలు అవసరమా? (వణుకు పుట్టించే చలితో మా అనుభవం వంటిది మీకు ఉన్నట్లయితే మీరు అవును అని చెప్పవచ్చు)
- మీ బాల్కనీ లో ఒక హ్యాంగింగ్ గార్డెన్, మీ ఇంటికి శక్తినిచ్చే సోలార్ ప్యానెల్, గ్రాండ్ స్కై లైట్, మీ ఇంటి వెనుక భాగంలో అందమైన తోట లేదా వర్షపు నీటి సేకరణ ఏర్పాట్లు చేయాలని మీరు నిర్ణయించుకుంటే స్ప్రింక్లర్లు అవసరమా?
మీరు ఇప్పుడు ఇంటిని రూపొందించడానికి మరియు నిర్మించడానికి మీకు సహాయపడే వాస్తుశిల్పి మరియు కాంట్రాక్టర్‌ను నియమించాలనుకుంటున్నారు. మొదట వాస్తుశిల్పి గురించి మాట్లాడుదాం (ఇది గాసిప్ కాదు). మీ అవసరాలకు సరైన వాస్తుశిల్పిని ఎలా ఎంచుకుంటారు? ఎవరినైనా విచారించడం మరియు ఆన్లైన్ ద్వారా వెతకడం ఉంటుంది. మీరు వాటిలో కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత, మీరు ఈ క్రింది ప్రశ్నలను అడగవచ్చు:
- వారి ఛార్జీలు ఏమిటి?
- మీరు ప్రణాళికలను చక్కగా విజువలైజ్ చేయడానికి 3D రెండరింగ్ ఉంటుందా?
- వారి శైలి ఏమిటి మరియు ఇది మీ ప్రాధాన్యతలకు సరిపోతుందా?
వాస్తవానికి, మీరు ఆర్కిటెక్ట్ కోసం వెతకడానికి ముందు మీ ప్రణాళికను పూర్తి చేయాలి.
మీరు ఆర్కిటెక్ట్ ను నియమించకూడదనుకుంటే, మీరు డిజైన్ కోసం Google లేదా Youtube ని కూడా ఉపయోగించుకోవచ్చు.
పార్ట్ 3 – ఎవెంజర్స్ ఐక్యత (మీరు, ఆర్కిటెక్ట్ మరియు కాంట్రాక్టర్):
మీ యొక్క ఏ ఆలోచనలు సాధ్యమవుతాయో మరియు వాటిని నిర్మాణంలో ఎలా చేర్చవచ్చో ఆర్కిటెక్ట్ మీకు సలహా ఇవ్వగలరు. మీ కోరికలు మరియు కలల నుండి మీ అవసరాలను వేరు చేయడానికి అవి మీకు సహాయపడతాయి.
మీరు మీ ఇంటిలోని అతి ముఖ్యమైన గదులను కూడా నిర్ణయించుకోవాలి, ఇది కూడా మీ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా మరియు అందంగా ఉండాలి. మీకు కావలసిన అవసరాల లిస్ట్ ను కలిగి ఉండటం, ప్రాధాన్యతను బట్టి ర్యాంక్ చేసుకోవడం సహాయపడుతుంది.
ఏదైనా ప్లాన్ ప్రకారం జరగకపోతే, B లేదా C ప్లాన్ ను కూడా ఉంచుకోండి. ప్రత్యామ్నాయ డిజైన్ల కోసం ఇంటర్నెట్లో పరిశోధించండి మరియు మీ ప్రస్తుత ఇంటి లోని ఏవైనా ఫీచర్స్ మీ క్రొత్త ఇంటిలో పునరావృతం చేయకూడదనుకు కుంటే వాటి జాబితా వ్రాయండి. మీకు ఎన్ని గదులు మరియు ఎలాంటి గదులు అవసరమో కూడా నిర్ణయించుకోండి.
- ఆఫీస్ వర్క్ కోసం మీకు ప్రత్యేక గది అవసరమా?
- మీకు ప్రత్యేక భోజనాల గది లేదా వంటగది లోనే తినేవిధంగా అవసరమా?
- మీకు టెలివిజన్ రూమ్ అవసరమా లేదా భారీ టీవీని మౌంట్ చేయడానికి మీ పడకగదిలోని గోడపై కొంత స్థలం అవసరమా?
- మీ ఇంటి లోపల ఆర్ట్ ను ప్రదర్శించడానికి మీకు ఎంత స్థలం అవసరం?
ఇవి మీరు పరిగణించవలసిన డిజైన్ యొక్క కొన్ని అంశాలు. మీ చిన్న మనస్సును గందరగోళం చేసే అంశాలు ఇంకా వందల సంఖ్యలో ఉండవచ్చు, అందువల్ల, వీటిని క్రమబద్ధీకరించడానికి మీ ఆర్కిటెక్ట్ మరియు ఇంటీరియర్ డిజైనర్‌ను సంప్రదించండి.
ఇప్పుడు మీకు సరైన ఆర్కిటెక్ట్ ఉన్నారు,ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ వేటకు వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా, మీ ఆర్కిటెక్ట్ డిజైన్ దశ ప్రారంభంలోనే కాంట్రాక్టర్‌ను పొందమని మీకు సలహా ఇవ్వవచ్చు, తద్వారా అవసరాల గురించి ప్రతి ఒక్కరికీ మొదటి నుండి స్పష్టంగా తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ప్రణాళికలను అమలు చేసి ఇంటిని వాస్తవ రూపం లోకి తెచ్చేది కాంట్రాక్టర్.
ప్రణాళికలు ఎలా ఉండాలో అదే విధంగా అమలు చేయబడతాయని వారు హామీ ఇస్తారు. అందువల్ల, మీరు వారితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి (ఇల్లు నిర్మించడానికి మంచి సామాజిక నైపుణ్యాలు అవసరం అని ఎంత మందికి తెలుసు!).
కాంట్రాక్టర్‌ను నియమించడానికి, మళ్ళీ, మీరు ఎవరో ఒకరి ద్వారా విని వెళ్లవచ్చు లేదా మీ ఆర్కిటెక్ట్ ను అడగవచ్చు. మీ వద్ద కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఈ క్రింది వాటిని చూడండి:
- వారి మునుపటి ఖాతాదారులతో మాట్లాడండి
- వారి గత ప్రాజెక్టుల ఫోటోలను పొందండి
- వారు మరియు మీరు ఏ సబ్ కాంట్రాక్టర్లు మరియు సరఫరాదారుల తో పని చేస్తారు అనే విషయం పై స్పష్టత కలిగి ఉండండి.
ఓహ్! మీరు ఇప్పటికే చాలా చేసినందుకు అభినందనకు అర్హులు. ప్రారంభించిన విధంగానే మొత్తం ప్రక్రియ బాగా పూర్తవుతుందని (నేను ఆ విధంగా ఆశిస్తున్నాను) నిర్ధారించుకో వడానికి ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయి. ప్లాన్లు సకాలంలో అమలు అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి భవన నిర్మాణ ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం.
అనుమతులు వంటి కొన్ని ఇతర అంశాలను కూడా బిల్డర్ చూసుకోవాలి మరియు క్రమం తప్పకుండా కాంట్రాక్టర్‌తో పాటు మీరే తనిఖీ చేయాలి. కానీ కాంక్రీటు నుండి వచ్చిన కొద్ది అందాన్ని చూసి, వాటాదారులకు షెడ్యూల్ కంటే ముందే చెల్లిం పు విషయంలో మీరు అత్యుత్సాహం చూపకండి.
ఇప్పుడు, మీ ఇల్లు చివరకు పూర్తయి మరియు మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ క్రింది పనులు చేయవలసి ఉంటుంది:
- శుభ్రపరచడం – ఎవరు చేస్తారు? మీరా లేదా మీ భార్యా? దీని బాధ్యత బిల్డర్ తీసుకునేటట్లు అగ్రిమెంట్ లో పేర్కొనాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను.
- ల్యాండ్ స్కేపింగ్ – మీ ఇంటి చుట్టూ అందమైన పచ్చిక లేదా ఆట స్థలం కలిగి ఉండవచ్చు
మీరు అంతా సమర్ధవంతంగా పూర్తి చేసారు. మీ క్రొత్త ఇంటికి అభినందనలు.
ధన్యవాదాలు