Home » Articles » ఇంటి రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయండ
ఆస్తిని కొనుగోలు చేయడం ఇప్పుడు గతంలో కంటే చాలా సులభం. HomeFirst తో మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. మా దగ్గర ఆన్లైన్లో ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసి, మా EMI ఎంపికలు మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ ప్రయోజనాన్ని పొందండి. మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ రుణ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు, వాటిని మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి మేము మా ప్రమాణాలను కూడా విస్తృతం చేసాము. మీరు ఇప్పటికే వేరే సంస్థ నుండి ఇంటి రుణం తీసుకున్నట్లయితే, మీరు దానిని కుడా సులభంగా బదిలీ చేయవచ్చు. కాబట్టి, HomeFirst ఫైనాన్స్ కంపెనీకి రండి మరియు మీ కలల ఇంటిలో నివసించండి.
ఇంటి రుణం కీలక ఫీచర్లు:
ప్రయోజనాలతో ప్రత్యేకంగా రూపొందించిన రుణాలు:
గరిష్ట రుణ మొత్తం: 25 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన గృహ రుణాలకు గరిష్టంగా 90% విలువ వరకు రుణం అందించబడుతుంది.
ఆదాయ రుజువు లేదు: స్వయం-ఉపాధి లేదా అనధికారిక వేతనదారులకు రుణం మంజూరు చేయడానికి మాకు ఆదాయ రుజువు అవసరం లేదు.
“ఆటో-ప్రీపే: ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు ఈ ఫీచర్ ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీ లేకుండా EMIతో పాటు ముందస్తు చెల్లింపులను సులభతరం చేస్తుంది.
రుణ మెరుగుదల: ఊహించని ఖర్చు ఉందా లేదా ఆస్తి విలువ పెరిగిందా? చింతించకండి, ఎందుకంటే మేము మీ ప్రస్తుత రుణానికి అదనపు మొత్తాన్ని జోడిస్తాము.”
HomeFirst ఇంటి రుణం ప్రయోజనాలు:
ప్రారంభం నుండి ముగింపు వరకు అంతా డిజిటల్‌గానే జరుగుతుంది
HomeFirst ఫైనాన్స్ కంపెనీలో మీరు ఇంటి రుణాలను మీ ఇల్లు లేదా ఆఫీస్ నుండి ఆన్లైన్లో సులభంగా మరియు సురక్షితంగా దరఖాస్తు చేయవచ్చు.
సహాయం 24×7
మీ ఇంటి రుణానికి సంబంధించిన ప్రశ్నల కోసం వెబ్సైట్ మరియు వాట్సాప్‌లో మా చాట్ సేవ మీకు సహాయం చేయడానికి రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటుంది.
మీ ఇంటి రుణాలను ఆన్లైన్లో నిర్వహించండి.
మీరు రుణాన్ని పొందిన తరువాత, మీరు మా వెబ్సైట్లో నుండి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వవచ్చు. మీరు ఖాతా స్టేట్మెంట్లు మరియు వడ్డీ పత్రాలను పొందవచ్చు మరియు ఇతర విషయాలతో పాటు ఇంటి రుణ పంపిణీని అభ్యర్థించవచ్చు.
డాక్యుమెంటేషన్ సులభంగా మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఆన్లైన్లో ఇంటి రుణాన్ని దరఖాస్తు చేయడం చాలా సులభం మరియు వేగంగా ఉంటుంది, పేపర్‌వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మా ఇంటి రుణ నిపుణులు మీ రుణ దరఖాస్తు విషయంలో మీకు సహాయం చేయడానికి మరియు అడుగడుగునా మార్గదర్శకత్వం అందించడానికి అందుబాటులో ఉన్నారు.
ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసేప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన చిట్కాలు:
గృహ రుణం ద్వారా మీరు నివాసయోగ్యమైన ఆస్తిని సంపాదించుకోవడమే కాకుండా పన్ను మినహాయింపుల ప్రయోజనం కూడా పొందుతారు. రుణం పొందినప్పటికీ మీరు ఆస్తిలో విలువలో కొంత మొత్తాన్ని, సాధారణంగా 20% వరకు మీరు స్వంత డబ్బు కట్టవలసి ఉంటుంది, మీరు రుణంగా తీసుకున్న మొత్తాన్ని మీ సౌలభ్యం మేరకు నిర్దిష్ట వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ప్రధాన రుణ మొత్తం మరియు వడ్డీ చెల్లింపు రెండూ మినహాయించబడతాయి. గృహ రుణ దరఖాస్తును బ్యాంక్ బ్రాంచ్‌లో లేదా ఆన్లైన్లో వ్యక్తిగతంగా పూర్తి చేయవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను చూద్దాం.
- గృహ రుణం దీర్ఘకాలిక నిబద్ధత అంటే కొన్ని సంవత్సరాల పాటు చెల్లించే రుణం కాబట్టి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMIలు)ల రూపంలో నెలకి మీరు ఎంత చెల్లించగలరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఇన్-హౌస్ రుణ EMIని ఎంత కట్టగలరో నిర్ణయించడానికి మీ టేక్-హోమ్ జీతం నుండి ఇతర రుణాలు మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో సహా మీ అన్ని ఖర్చులను లెక్కించండి. బ్యాం
- మీరు భారీ రుణం కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంక్ మిమ్మల్ని తిరస్కరించవచ్చు. ఇంకా, మీరు ఎంత అర్హత పొందారో మీకు తెలిసిన తర్వాత, మీరు డౌన్ పేమెంట్‌లో మిగిలిన మొత్తాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
- మీకు ఇప్పటికే ఆర్థిక సంబంధాలు ఉన్న కంపెనీలో ఇంటి రుణం కోసం దరఖాస్తు చేయమని సిఫార్సు చేస్తాం. బ్యాంక్‌కు ఇప్పటికే మీ చెల్లింపు చరిత్ర మరియు ఉద్యోగం, జీతం వంటి గోప్యమైన సమాచారం తెలిసినట్లయితే, నో యువర్ కస్టమర్ (కెవైసి) ప్రక్రియ చాలా త్వరగా అయిపోతుంది.
- చాలా సందర్భాల్లో, మీరు మీ ఇతర రుణాలను ఎంత ఖచ్చితంగా చెల్లిస్తున్నారో తెలిపే రికార్డ్‌ను బట్టి మరియు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు బ్యాంక్ నుండి రుణం త్వరగా ఆమోదించబడుతుంది, తిరిగి చెల్లింపు షెడ్యూల్ మీకు అనువుగా ఉంటుంది మరియు ప్రాసెసింగ్ ఛార్జీలు కుడా తక్కువ ఉంటాయి. నిర్దిష్ట సందర్భాల్లో గృహ రుణంపై బ్యాంక్ తక్కువ వడ్డీ రేటును ఇవ్వవచ్చు.
- మీరు మీ ఇంటిని కొనుగోలు చేస్తున్న ప్రాజెక్ట్ అన్ని చట్టపరమైన మరియు నియంత్రణ అనుమతులను పొందిందో లేదో నిర్ధారించుకోండి. అదే విధంగా, మీ బ్యాంక్‌కి అధీకృత ప్రాజెక్టుల జాబితా ఉందా లేదా మీ ప్రాజెక్ట్ మీ బ్యాంక్ ద్వారా ఆమోదించబడిందా అని చూడండి. ఇది మీ ఇంటి రుణం దరఖాస్తు త్వరగా ఆమోదించడానికి సహాయపడుతుంది.
- మీకు పెద్ద మొత్తంలో రుణం అవసరం అయ్యి, దానికి మీ ఆదాయం అనుమతించకపోతే, మీ జీవిత భాగస్వామి/తల్లిదండ్రులు/తోబుట్టువులతో కలిపి రుణాన్ని తీసుకోవచ్చు. మీరు ప్రత్యామ్నాయంగా ఎక్కువ రీపేమెంట్ వ్యవధితో రుణాన్ని ఎంచుకోవచ్చు. ఎక్కువ కాలం చెల్లించడం వలన EMI తగ్గుతుంది మరియు ఫలితంగా మీ నెలవారీ ఖర్చులపై భారం కూడా తగ్గుతుంది.
HomeFirst ఫైనాన్స్ కంపెనీలో, మా కస్టమర్లు సొంత ఇంటి కలను వ్యక్తపరచిన సమయం నుండి వారు తమ కొత్త ఇంటిలో స్థిరపడే సమయం వరకు ఇంటిని సంపాదించే మొత్తం ప్రక్రియను సులభతరం చేయడమే మా లక్ష్యం.
ఈ కథనాన్ని వాట్సాప్‌లో షేర్ చేయండి